Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27 నుండి 31 వరకు జిల్లావ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ-సూర్యాపేట
రోజురోజుకు పెంచుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దీనికి వ్యతిరేకంగా ఈనెల 27 నుండి 31 వరకు జిల్లావ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాన్ని వామపక్ష శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి,సీపీఐ జిల్లా నాయకులు దోరేపల్లి శంకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంట నాగయ్య,సీపీఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివ కుమార్,ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వరికుప్పల వెంకన్న,సీపీఐఎంఎల్ రామచంద్రన్ వర్గం రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ,బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరి నర్సయ్య పిలుపునిచ్చారు.మంగళవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వామపక్ష పార్టీల సమావేశంలో వారు మాట్లాడారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ,వంటగ్యాస్, బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలను ఇష్టానుసారం పెంచడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజలందరికీ 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు.అసంఘటిత రంగ కార్మికుల కు 7500 రూపాయలు ఇవ్వాలని కోరారు.ఉపాధిహామీ చట్టానికి నిధులు పెంచి పట్టణ ప్రాంతాల్లో ఉపాధిహామీ చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధిఅవకాశాలు కల్పించి యువతను ఆదుకోవాలన్నారు.నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భతి కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, ఎల్గూరి గోవింద్, కోటగోపి, జిల్లాపల్లి నర్సింహారావు,మేకనబోయిన శేఖర్, దండా వెంకట్రెడ్డి, వామపక్ష నాయకులు షేక్నజీర్, ఎర్రఅఖిల్ పాల్గొన్నారు.