Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలంలోని దోరకుంట గ్రామంలో ఉపాధిహామీ చట్టంలో భాగంగా జరుగుతున్న కాలువ పూడికతీత పనులను జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ అధనపు జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి డా పి.పెంటయ్య మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిప్రదేశంలో డిమాండ్ కోరిన వారు పనికి రాకపోవడం, ఒకరి బదులు మరొకరు పనిచేయడం పూర్తివేతనం రూ.257 పొందడానికి పని వద్ద కొలతలు ఇవ్వకపోవడం, ,20 మందికి ఒక సూపర్వైజర్ను ఏర్పాటు చేయకపోవడం, పనికి ముందు పనికొలతలు రికార్డు చేయకపోవడాన్ని గుర్తించారు.కూలీలకు పూర్తి గిట్టుబాటు వేతనం కోసం విధిగా పని ప్రారంభానికి ముందే కొలతలు పెట్టి 20 మంది కూలీలకు ఒక సూపర్వైజర్ దగ్గరుండి పని చేయించాలన్నారు.కూలీల ముఖాలు కనిపించేలా ఫొటో హాజరువేయాలని, రోజుకు గ్రామానికి 300 మంది తగ్గకుండా కూలీలకు పనికల్పించాలని, పనికోరిన వారందరికీ పనికల్పించాలని మస్టర్లో పేరున్న వారు మాత్రమే పనిచేయాలన్నారు.ఒకరిబదులు మరొకరు పని చేస్తే ప్రమాద సమయంలో ఎలాంటి సహకారం ప్రభుత్వం ద్వారా ఉండదని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయశ్రీ, ఈసీ నాగేశ్వర్రావు, టీఏ రామకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి మోతీలాల్ పాల్గొన్నారు.