Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలో అర్హత కలిగిన దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ దళితబంధు పథకం అందరికీ వర్తింపజేసి ఆదుకోవాలన్నారు.పథకం లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యే జోక్యం లేకుండా చూడాలన్నారు.అధికారులు అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పథకం వర్తింపజేయాలని కోరారు. ధర్నా సమయంలో దరఖాస్తులు తీసుకొని ఎప్పుడు రాజకీయ నాయకుల ఒత్తడి మేరకు దరఖాస్తులు వాపసు తీసుకోమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.అధికారులు పేద ప్రజల కోసం పని చేయాలని అధికార పార్టీ నాయకుల కోసం పని చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి దళితబంధువర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు కోడిరెక్క మల్లయ్య, దైద జనార్దన్, బొంగరాల వెంకటయ్య, దళితసంఘాల నాయకులు బొల్లంపల్లి పాపారావు, తక్కలపల్లి ఏసుబాబు,సైదులు,అంకెపాక జానయ్య, నీలం కమలమ్మ,జయమ్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.