Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న దాడులలో కులాంతర వివాహ జంటల హత్యలు, పరువు హత్యల నివారించడానికి మతాంతర వివాహ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వర్రావు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా నాయకులు సిరికొండ శ్రీను డిమాండ్ చేశారు.నేరేడుచర్లలో మంగళవారం నిర్వహించిన ఆ సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇప్పటివరకు ఏడాదికాలంలో 74 హత్యలు జరిగాయన్నారు.ఈ కేసు విషయంలో పోలీస్అధికారులు కేసులు నమోదు చేయడంలోనూ, రక్షణ కల్పించడంలోనూ, చట్టప్రకారం కోర్టులో న్యాయం పొందేందుకు సహకరించడం లేదన్నారు.అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో నానాటికీ ఈ హత్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు.ఈ సమావేశంలో మండలఅధ్యక్షుడు దోరేపల్లి వెంకటేశ్వర్లు, మండల నాయకులు కోదాటి సైదులు, టౌన్అధ్యక్షులు గుర్రంఏసు, మడుపు దేవయ్య, వడ్లమూడి ఉపేందర్, ఎడ్ల సైదులు, పట్టణ నాయకులు భరత్ పాల్గొన్నారు.