Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు నామకరణం చేయగా వ్యతిరేకిస్తూ గహ దహనాలు , లూటీలు బందులు, విధ్వంసాలు సష్టిస్తున్న అగ్రవర్ణ ఆధిపత్యకులాల చర్యలను ఖండిస్తూ కెేవీపీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో సుభాష్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ దేశంలో కుల ఉన్మాదం మతోన్మాదం పెచ్చరిల్లిపోతోందన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబేద్కర్ పేరును నిరాకరించడం అంటే దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని అన్నారు. గతంలో రంగారెడ్డి ,సంగారెడ్డి , కామారెడ్డి , వైఎస్ రాజశేఖర్ రెడ్డి , ప్రకాశం , అల్లూరి , ఎన్టీ రామారావు , వంటి వారి పేర్లు దేనికోసం పెట్టారని ఎవరూ వ్యతిరేకించలేదు గదా అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కోనసీమ అంబేద్కర్ జిల్లా పైన తమ అభిప్రాయాలని వెంటనే వెలిబుచ్చాలని యథావిధిగా కొనసాగించేందుకు ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు .భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి గెలిచిన ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. అంబేద్కర్ జిల్లా పేరుపైనా స్పందించని ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా వ్యాప్తంగా గ్రామ , మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు దిష్టిబొమ్మలు ఊరేగింపులు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహయ కార్యదర్శి గాదె నర్సింహ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు రవీందర్ కుమార్ , తల కొప్పుల సతీష్ , కిరణ్ , శివ, రవీందర్, స్వామి , సైదులు , వెంకట్, పావని , రమ్య ,మహేశ్వరి పాల్గొన్నారు.