Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగులకు అందని వైద్య సేవలు
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్లపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం మెడికల్ కళాశాల ఎదుట డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. 57 మంది డాక్టర్లకు ఆకస్మికంగా మెమోలు జారీ చేసిందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఏప్రిల్ నెలలో 30 రోజులు సాలరీ చేయాల్సి ఉండగా 23 రోజులకే సాలరీ చేసిందని ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా అబ్సెంట్ వేస్తున్నారని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేసున్నారు. ప్రిన్సిపాల్ గత మూడు సంవత్సరాల నుంచి డాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మెడికల్ కళాశాలలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లీనికల్ విభాగంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు పేర్కొంటున్నారు. క్లినికల్ డిపార్టుమెంట్‌కు కేటాయించిన బడ్జెట్ మొత్తం ప్రిన్సిపాల్ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ప్రిన్సిపాల్ సక్రమంగా విధులకు రాకున్నా కూడా నెల రోజుల పూర్తి సాలరీ తీసుకుంటుందని, తాము మాత్రం నెల రోజులు విధులకు హాజరైనా వేతనాల్లో కోత విధిస్తున్నారని డాక్టర్లు ఆరోపిస్తున్నారు . మెడికల్ కళాశాలల్లో చోటు చేసుకున్న అక్రమాలపై పూర్తి విచారణ జరిపే వరకు డాక్టర్లు విధులకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు.