Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని రాజీవ్ స్మారక ట్రస్టు చైర్మెన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో బుధవారం మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఊదరి బుచ్చయ్య కుటుంబానికి రూ.15వేలు ట్రస్టు కార్యదర్శి ఎమ్‌డి. ఖయ్యుమ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ ట్రస్టు నిరుపేద కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్కంటి వెంకట్‌రెడ్డి, బొమ్మిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తొర్పునూరి లింగస్వామిగౌడ్, ఊదరి గణేశ్ పాల్గొన్నారు.