Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కలెక్టరేట్లో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, వేడుకలలో అన్ని శాఖలు తమ శాఖల ద్వారా నిర్వహించే అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలని, లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ చేపట్టాలని, ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీచేయాలని, కలెక్టరేట్ లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖలుతమ శాఖల ద్వారా నిర్వహించే అభివద్ధి కార్యక్రమాలపై నివేదికలను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలని తెలిపారు. అనంతరం ఏర్పాట్లు పరిశీలించారు. పోలీస్ పరేడ్ కు అవసరమైన స్థలాన్ని పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ రెడ్డి కి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, రెవిన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి, పాల్గొన్నారు.