Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఏస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
గత 50 రోజులుగా కొండపైకి ఆటోలు నడుపుకుంటూ జీవనం కొనసాగించే ఆటో కార్మికులు దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని టీజేఏస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం ఆటో కార్మికుల దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు .ఈ సందర్భంగా కార్మికులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులకు జీవన ఉపాధి కల్పించేందుకు కొండపైకి ఆటోలను అనుమతించాలని కోరారు.ఆటో కార్మికులకు న్యాయం జరగని పక్షంలో హైదరాబాద్లో ఒక రోజు దీక్ష చేపడతామని హెచ్చరించారు, ఏండ్ల నుండి దేవున్ని నమ్ముకుని బ్రతుకుతున్న కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం తగదన్నారు.ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్ మండల అధ్యక్షురాలు కొంగరి అనిత సాంస్కతిక విభాగం కోఆర్డినేటర్ చిప్పలపల్లి మధు యువజన సమితి జిల్లా అధ్యక్షులు బాలకష్ణ నాయకులు వెంకన్న,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.