Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలోని బస్టాండ్ వద్ద మహనీయుల విగ్రహాల పక్కన సులబ్కాంప్లెక్స్ నిర్మించొద్దని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పట్టణకేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహానీయులు జ్యోతిరావు పూలే, చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే, తెలంగాణ సాయుధ పోరాట యోధులు కట్కూరి సుశీలాదేవి, రామచంద్రారెడ్డి విగ్రహాల పక్కన వివిధ పార్టీలకు చెందిన గద్దేలను తొలగించి పుర పాలకవర్గం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని సులబ్ కాంప్లెక్స్ నిర్మించడం సరికాదన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని ఇది మహనీయులను అవమానించడమే అవుతుందన్నారు. ఆలేరు పురపాలక చైర్మెన్ వస్పరి శంకరయ్య ఒంటెద్దు పోకడలను మానుకొని, ఇలాంటి చర్యలను విరమించుకోవాలన్నారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్ , ఇక్కిరి సహదేవ్, పద్మ సుదర్శన్, బీఎస్పీ నాయకులు మొరి గాడి శ్రీశైలం, ,ఎమ్మార్పీఎస్ రమేష్ నాగరాజు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎమ్ ఎ ఎక్బాల్, మండల కార్యదర్శి ధూపాటి వెంకటేష్ ,పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ మొరిగాడి చంద్రశేఖర్ ,మున్సిపల్ పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు మొరిగాడి రమేష్ ,వడ్డెమాన్ శ్రీనివాసులు, నల్ల మాస తులసయ్య, రాజేష్ ,విప్లవ్, చక్క పరుశరాములు, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, సిపిఐ జిల్లా నాయకులు అయిలి సత్తయ్య, గొట్టిపాముల రాజు పాల్గొన్నారు.
సులబ్కాంప్లెక్స్ నిర్మించొద్దు
పురపాలక సంఘంలో బస్టాండ్ వద్ద మహానీయుల విగ్రహాల పక్కన సులబ్ కాంప్లెక్స్ నిర్మించొద్దని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మొరిగాడి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ పాలక వర్గం , అధికారులు నిర్లక్ష వైఖరి వల్ల ఆలేరు బస్టాండ్ ముందు నెలకొలిపిన మహాత్మ జోతిరావుఫూలేె , సావిత్రి బాయిఫూలే, ఆరుట్ల సుశీలా రాంచంద్రారెడ్డి దంపతుల విగ్రహాల పక్కన సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం పురపాలక వర్గం మహానుయులని అవమాన పరచడమే అన్నారు. సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం వెంటనే ఆపాలని, లేదంటే ప్రజలు ఆ మహనీయుల గౌరవం కాపాడడం కోసం ఉద్యమిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఎక్బాల్, నాయకులు మొరిగాడి రమేష్ ,వడ్డేమాన్ శ్రీనివాసులు ,మొరిగాడి లక్ష్మణ్, గణేష్ ,ఆంజనేయులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.