Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఉద్యోగరీత్యా ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వరరెడ్డి అన్నారు.నాగార్జునసాగర్సర్కిల్ సీఐగా పనిచేసి ఇటీవల సీసీఎస్ నల్లగొండకు బదిలీపై వెళుతున్న సీఐ గౌరునాయుడుకు మంగళవారం నూతన సీఐ కె.నాగరాజు, స్థానిక ఎస్ఐ రాంబాబు, సర్కిల్ పరిధిలోని ఎస్సైల ఆధ్వర్యంలో హిల్‌కాలనీలోని రెడ్డి ఫంక్షన్హల్లో ఆత్మీయసమావేశం నిర్వహించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.నాగార్జునసాగర్ సర్కిల్పరిధిలోని ప్రజలకు చేరువ య్యారన్నారు.విధి నిర్వహణలో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చి తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపు కున్నా రన్నారు.ఆయన భవిష్యత్‌లో మరింత పేరు గడించాలని ఆకాంక్షించారు. కరోనా సమయంలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేసి ప్రజలను కాపాడడంలోనూ ఆయన కషి ఎనలేని దన్నారు.అనంతరం పోలీస్‌సిబ్బంది, ప్రజా ప్రతినిధులు,స్థానికులు గజమాలతో సీఐ గౌరునాయుడును సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ చంద్రశేఖర్, మిర్యాలగూడ సీఐ సత్యనారాయణ,హాలియా సీఐ సురేష్, డ్యామ్ ఆర్ఐ పవన్‌కుమార్, సాగర్ సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.