Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
రూపాయి రూపాయి పొదుపు చేసి దాచుకున్న డబ్బులతో ఆపదలో అక్కరకు అవసరమవుతాయని, చిట్టీలో చేరితే చిట్టి ఎత్తి నెలలు గడుస్తున్నా చిట్స్ యాజమాన్యం వారు డబ్బులు చెల్లించకపోవడంతో బుధవారం కోదాడ అక్షర చిట్స్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.సిబ్బందిని కార్యాలయంలో ఉంచి గేట్లకు తాళం వేశారు.ఈ సందర్భంగా బాధితు ల్లో ఒకరైనా గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంకు చెందిన మీసాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాను గత ఏడాది ఆగస్టు నెలలో 42 నెలలు కట్టిన అనంతరం రూ.15 లక్షలు చిట్టి పాడానని, చిట్టి పాడి తొమ్మిది నెలలు గడుస్తున్నా కార్యాలయం చుట్టూ తిరగంగా తిరగంగా రూ.2 లక్షలు ఒకసారి మరోసారి రూ.2లక్షలు మాత్రమే చెల్లించారన్నారు.మిగతా బకాయిలు చెల్లించమంటే మేనేజర్ కార్యాలయం చుట్టూ తిప్పుతూ డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.చివరికి గత్యంతరం లేక కార్యాలయం ముందు ఆందోళనకు దిగామన్నారు.ఇదే మాదిరిగా కోదాడ,చిలుకూరు, బేతవోలుకు చెందిన మరికొంత మంది బాధితులు చిట్టి ఎత్తిన తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ కార్యాలయంలో సిబ్బందిని నిల దీశారు.మేనేజర్ లేకపోవడంతో ఇదే సమయంలో యాక్షన్ నిర్వహించడానికి కార్యాలయానికి వచ్చిన రీజినల్ మేనేజర్ యాదగిరితో తమ గోడు వెళ్లబోసుకున్నారు.మేనేజర్ లేనిది తాము ఏమీ చెప్పలేమని ఆయన సమాధానం ఇచ్చి వెళ్ళిపోయారు.ఎల్లుండి మేనేజర్ వస్తారని కార్యాలయానికి వచ్చి మాట్లాడండని తెలిపారు.అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.