Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో కాంగ్రెస్ హయాంలో 30 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణం చేసినప్పటికీ ఆ ఇండ్లు నేటి వరకు లబ్దిదారులకు కేటాయించకపోవడంతో శిథిలావస్థకు చేరగా బుధవారం నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు వెంటనే ఇండ్లను పంపిణీ చేయాలని కోరారు.తాను గహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బూరుగడ్డ గ్రామానికి 420 ఇండ్ల మంజూరు చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.నియోజకవర్గంలో అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్‌రెడ్డి ,అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్ పాల్గొన్నారు.