Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
చేపల చెరువులను వెడల్పు ఎత్తు ఎక్కువగా తవ్వించాలని డీఆర్డీఏ ఏపీడీ డాక్టర్ పెంటయ్య అన్నారు.మంగళవారం మండలంలోని రామాపురం గ్రామంలో చేపల చెరువుపనులను ఆయన పరిశీలించి మాట్లాడారు.కూలీలు కొంచెం ఎక్కువ సమయంలో పని చేస్తే 40 మీటర్ల పొడవు 50 మీటర్ల వెడల్పులో 2 మీటర్లలోతు చెరువు తవ్వితే రూ.10 లక్షలు వస్తాయన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలో పనిచేసే కూలీలు ఉపయోగించి ఎక్కువ వేతనం పొందాలని కూలీలు ఉదయం సాయంత్రం వేళల్లో పని చేస్తూ మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవాలన్నారు.20 మంది కూలీలకు ఒక సూపర్ వైజరును పెట్టి అతనితో ఫొటోలు హాజరు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ నిర్మల, ఈసీ మహేష్, టీఏ గిరి, సర్పంచ్ మీసాల గంగాలింగయ్య పాల్గొన్నారు.