Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ
నవతెలంగాన-సూర్యాపేట
రానున్న వర్షాకాలం నేపథ్యంలో పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పారిశుధ్య నిర్వహణ లోపం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణశ్రీనివాస్ తెలిపారు.బుధవారం స్థానిక 27వ వార్డులో మేజర్ కాలువల్లో షీల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం దష్ట్యా మురికి కాలువల్లో వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు పెద్ద కాలువల్లో షీల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నా మన్నారు.తెలిపారు. రోజువారీ కూలీలతో రూ.19.60 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్టకిశోర్, కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి,కౌన్సిలర్ అనంతుల యాదగిరి, టీఆర్ఎస్ యువజననాయకులు శిరివెళ్ల శబరీనాథ్, శ్రీనివాస్, అధికారులు జీకేడీ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.