Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
అందరి సహకారంతో మండలాన్ని అభివద్ధి చేసుకుందామని ఎంపీపీ ధరావత్ కుమారిబాబు నాయక్, పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్ రావు అన్నారు.బుధవారం మండలకేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదికను చదివి వినిపించారు.అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ వేలకోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కలను సంరక్షించాలని తెలిపారు.అనుమతి లేకుండా చెట్లను నరికి వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.గ్రామ పంచాయతీలలో నిర్మించిన వైకుంఠదామాలలో దహన సంస్కారాలు నిర్వహించుకునే విధంగా గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు.విద్యుత్ శాఖ అధికారి రమేష్ తన నివేదికను చదివి వినిపిస్తుండగా ఐలాపురం సర్పంచ్ బోడపట్ల సునీత శ్రీను మాట్లాడారు.ఐలాపురం ఆవాసం గుర్రంతండాలో విద్యుత్ సమస్య ఉన్నదని, అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని సమస్యను పరిష్కరించాలని కోరారు. విద్యుత్ శాఖ అధికారి రమేష్ అతి త్వరలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం బండమీదిచందుపట్ల ఎంపీటీసీ కోడి బండ్లయ్య మాట్లాడుతూ ఉపాధికూలీలకు చేసిన పనులకు సంబంధించిన డబ్బులు నెలలు గడుస్తున్నా సకాలంలో చెల్లించడం లేదని ఆరోపించారు.రోజు కూలి వంద రూపాయల కంటే తక్కువగా వేస్తున్నారని,కూలీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మండల అభివద్ధి కార్యక్రమాలపై ఎంపీవో తన నివేదికను చదివి వినిపిస్తుండగా పాండ్యనాయక్తండా సర్పంచ్ ధరావత్ భిక్షంనాయక్ కలగజేసుకుని మాట్లాడారు.మండల అధికారులు ఎవరైనా ఇన్చార్జిలు ఉన్నట్టయితే వీలైనంత త్వరగా రెగ్యులర్ ఉద్యోగులను నియమించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఎస్టీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా రుణాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసీిల్దార్ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మీ, ఎంపీఓ గోపి, ఏఈలు లింగానాయక్, మౌనిక,రమేష్, ఏఓ ఆశా కుమారి,ఏపీఓ నాగయ్య, ఉద్యాన శాఖ అధికారి జగన్ పాల్గొన్నారు.