Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని మాజీ మంత్రి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అన్నారు.పట్టణపరిధిలోని కొమరబండలో మంగళవారం రాత్రి రచ్చబండ రైతు భరోసా యాత్రలో ఆమె ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.తెలంగాణలో రైతులే దేశానికి ముఖ్యమన్నారు. రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్న ధరణికోటను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎత్తివేస్తుందని హామీ ఇచ్చారు.భూమి ఉన్న కౌలు రైతులకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.15వేల ఆర్థికసాయం అందజేస్తామన్నారు.వరంగల్‌లో ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌ను ప్రతి గ్రామానికి చేరవేస్తామన్నారు.ప్రజలకోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు ఉత్తమ్ అన్నారు.అవినీతిపరులు ఉన్న రాష్ట్రంలోనీతి,నిజాయితీకి మారుపేరు సౌమ్యుడని కితాబిచ్చారు.టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు.ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోదాడ ఎమ్మెల్యే స్యాండ్, ల్యాండ్, మైనింగ్ దందాలు చేస్తున్నాడని ఆరోపించారు. అని విమర్శించారు. అధికార బలంతో,మందిబలంతో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.పార్టీ అధికారంలోకి రాగానే కొమరబండను మున్సిపాలిటీ నుండి విముక్తి చేస్తామన్నారు.ధనికరాష్ట్రాన్ని పేరు చెప్పుకుంటూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు.ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారన్నారు.రచ్చబండలో ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు.వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.ప్రజాసమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రామారావు, రాష్ట్ర నాయకులు బషీర్, ధనమూర్తి, కంభంపాటిశ్రీను, పారసీతయ్య, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కందులకోటేశ్వరరావు, కౌన్సిలర్లు గంధం గిరి, రమానిరంజన్‌రెడ్డి, షాబోద్దిన్, ప్రసన్న కోటిరెడ్డి, మైనార్టీ నాయకులు బాగ్దాద్, బాజన్, బాబా తదితరులు పాల్గొన్నారు.