Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో అమరవీరుల స్తూపం వద్ద బెల్లి లలిత అక్క 23 వర్థంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె తనయుడైన సూర్య ప్రకాష్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మా అమ్మ బెల్లి లలిత అక్క 1996 సంవత్సర కాలంలో తెలంగాణ వాదాన్ని ఊరూరా తిరిగి ప్రజలని చైతన్య పరిచిందన్నారు. ఆంధ్ర పాలకులను తన పాట రూపంలో నిలదీసిందన్నారు. ఓర్వలేని ఆంధ్ర పాలకుల ప్రభుత్వం బెల్లి లలితక్కను హతమార్చి నేటికి 23 ఏండ్లు పూర్తి అయిందన్నారు. అనంతరం పండ్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో గుర్రాల శ్రీనివాస్, సురేష్, జనగాం కవిత నర్సింహ చారి, శివుడు, సజన శంకర్, ఉదరి సతీశ్, ఆటో వెంకటేష్, బలరాం, గుండెబాయిన రాజు, గుండెబోయిన నర్సింహ పాల్గొన్నారు.