Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
సమీకత ఉద్యాన అభివద్ధి మిషన్ పథకం లో భాగంగా మండలంలోని చిన్నకొండూర్ గ్రామంలో శీతల గిడ్డంగి ఏర్పాటుకు ఎంపిక కావడం జరిగింది.750 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగిని ఏర్పాటు చేయడానికి హెచ్ వి ఆగ్రో కోల్డ్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ సుష్మ, నాబ్ కేన్స్ భరత్, ఉద్యాన శాఖ ఉన్నతాధికారి కె.కిషన్ రావు ప్రాథమిక పరిశీలిన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు అన్నపూర్ణ,మహేష్,ఉద్యానవన అధికారి బి.సంతోషి రాణి పాల్గొన్నారు.