Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
- ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అన్విత రెడ్డి కి సన్మానం
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు తెలంగాణ మహిళలలో ఒకరు అన్వితరెడ్డి జిల్లాకు చెందిన వారు కావడం ఎంతో గర్వాంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత రెడ్డిని కలెక్టర్ తన ఛాంబర్లో సత్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పిల్లల భవిష్యతు బాగు చేయడంలో ముందు తల్లిదండ్రుల పాత్ర, తరువాత ఉపాధ్యాయుల పాత్ర ఉంటుందన్నారు. అన్విత రెడ్డి తల్లి అంగన్ వాడి టీచర్, తండ్రి వ్యవసాయం చేస్తూ తమకు ఉన్న ఇద్దరి ఆడపిల్లల్లో ఒకరిని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించిన తల్లి దండ్రులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి కష్ణవేణి పాల్గొన్నారు.
పునరావాసం పనులను తనిఖీ చేసిన కలెక్టర్
మండలంలోని బస్వాపురం గ్రామంలో నిర్మించనున్న నసింహ రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న బి ఎన్ తిమ్మాపురం గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీ సమీపంలో చేపడుతున్న పనులను కలెక్టర్ పమేలా సత్పతి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని ప్లాట్లు కావాలి, భూమి చదును వివరాలు, పునరావాసం పనులలో పురోగతిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ అధికారులు 1100 ప్లాట్లు తిమ్మాపురం గ్రామస్తులకు కావాల్సి ఉందని, ఇక్కడ 950 ప్లాట్లకు అవకాశం ఉందని తెలిపారు. మిగతా వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఈ పనులకు 35 కోట్లు మంజూరు కాగా సివిల్ పనికి 20 కోట్లు, భూసేకరణ ప్లాట్ లేఅవుట్ కు సంబంధించి ఇతర నిధులను ఖర్చు చేయు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డీఈ గిరిదర్, ఏఈ ప్రసాద్ పాల్గొన్నారు.