Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- ఆలేరుటౌన్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు యెలుగల బాలయ్య ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ కోరారు. బాలయ్య ప్రథమ వర్థంతి సందర్భంగా గురువారం పట్టణంలోని బాలయ్య నివాసం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ లో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ప్రజా సమస్యలపై ఉధతంగా పోరాటం చేశారన్నారు. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. బాలయ్య సేవలు పార్టీ మారవదని చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు ,పట్టణ కార్యదర్శి ఎంఏ.ఎక్బాల్ ,మండల కార్యదర్శి దుపటి వెంకటేష్ ,సింగిల్ విండో మాజీ చైర్మెన్ మొరిగాడి చంద్రశేఖర్ , మాజీ సర్పంచ్ ఆకవరపు మోహనరావు, పీఏసీఎస్ డైరెక్టర్ కె.సాగర్ రెడ్డి ,నాయకులు మొరిగాడి రమేష, వడ్డేమాన్ శ్రీనివాసులు, మొరిగాడి అజరు, మొరిగాడి విజరు, మొరిగాడి మహేశ్, యెలుగల కుమారస్వామి ,ఘనగాని మల్లేష్ , శివ, చెన్న రాజేష్ ,కాసుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.