Authorization
Sat March 22, 2025 07:27:11 am
నవతెలంగాణ -నూతనకల్
రైతులకు కల్తీ విత్తనాలను విక్రయిస్తే దుకాణదారులకు కఠిన చర్యలు తప్పవని ఎస్సై వై.ప్రసాద్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రంలో నిల్వ ఉన్న పత్తి విత్తనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న ప్రతి విత్తన విక్రయ దుకాణాలు యజమానులు నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించిన రాదని నాణ్యమైన కంపెనీ విత్తనాలను రైతులకు అందించి అధిక దిగుబడి సాధనకు సహకరించి రైతుల శ్రేయస్సు కోసం కషి చేయాలని వారు సూచించారు.ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.