Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చివ్వేంల
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేయడం విచారకరమణి టీఎస్ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రావిచెట్టు సత్యం అన్నారు. గురువారం మండలపరిధిలోని వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేసి అల్లర్లు సష్టిస్తున్న విధానానికి వ్యతిరేకిస్తూ బహుజననులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్టంలో అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు,మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు , అన్నమయ్య ,సత్యసాయి లాంటి వ్యక్తుల పేర్లు పెట్టడాన్ని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అందరూ స్వాగతించారన్నారు. కానీ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును నామకరణం చేయడాన్ని మనువాదులు జీర్ణించుకోలేక కొన్ని స్వార్థపర మైన , మనువాద మతోన్మాద శక్తులు ప్రజల్లో విద్వేషాలు రగిల్చి వివాదం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు గోగుల రమేష్ ,గోగుల రాజు, జంపాల జానయ్య, బయ్య గణేష్ యాదవ్, వీరబోయిన మహేష్ యాదవ్, మచ్చ గోపి, గోగుల వెంకట రమణ, గోగుల మధు, వీరబోయిన సైదులు యాదవ్,గోగుల రాంబాబు, గోగుల రాజశేఖర్, కొండ నిక్షిత్, జంపాల సాయి తదితరులు పాల్గొన్నారు.