Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద నీరు సాఫీగా సాగేందుకు షీల్ట్ తొలగింపు
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి క్షేమమే లక్ష్యంగా మున్సిపాలిటీ పనిచేస్తుందని చైర్పర్సన్ పెరమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ సాధారణ, పట్టణ ప్రగతి నిధులు రూ 35 లక్షలతో గురువారం స్థానిక 27వ వార్డులోని నాలాలో షీల్ట్ తొలగింపు పనులను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వర్షాకాలంలో వరద నీటి నుంచి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు షీల్ట్ తొలగింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. చిన్న చిన్న సందుల్లోని కాలువల్లో రోజువారీ కూలీలతో , పెద్ద పెద్ద మురుగు కాలువలు, నాలాలలో తొలగిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్్ పుట్టాకిషోర్, మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు శిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ, చింతలపాటి భరత్ మహాజన్, ఈఈ జికెడి ప్రసాద్, ఏఇలు రాజిరెడ్డి, నదీమ్, వార్డు పెద్దలు అశోక్ పాల్గొన్నారు.