Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి
- మ్యాప్ లను సత్వరమే అందించాలి
- అలసత్యంపై చర్యలు తప్పవు
- కలెక్టర్ టి. వినరు కష్ణా రెడ్డి
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ఇరిగేషన్ భూములలో పచ్చదనం పెంచేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి. వినరు కృష్ణా రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు ఎస్. మోహన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్లతో కలసి ఆయన ఎన్ఎస్పీ, ఎస్ఆర్ఎస్పీి, డీిఆర్డిఏ,పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులతో వచ్చే హరిత హారంలో మొక్కల ప్లాంటేషన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్ఎస్పీ, ఎస్ఆర్ఎస్పీి కాలువలకు ఇరువైపుల గల ప్రభుత్వ భూములలో గుర్తించిన ప్రాంతాలలో ప్రకతి వనాలు, మెగా ప్రకతి వనాలు ఏర్పాటుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అందుకు గాను సత్వరమే ప్రతిపాదనలు సిద్ధంచేసి అనుమతులు పొందాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్ఎస్ పి కాలువలకు ఇరువైపులా 146 కిలో మీటర్లు ఉండగా 50 మీటర్ల చొప్పున మెగా పల్లె ప్రకతి వనాలు అలాగే ఎస్ఆర్ఎస్పీ కాలువలు ఇరువైపుల 212 కిలోమీటర్లు ఉండగా 20 మీటర్ల లలో పల్లె ప్రకతి వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశించిన మొక్కల ప్లాంటేషన్ పనులను సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయి అవగాహనతో పాటు అనుకున్న సమయానికి అందించాలని , పనులలో అలసత్యం చూపే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చేపట్టే ప్రతిపాదనల అంచనాలకు మంజూరు తీసుకొని మొక్కల కోసం గుంతలు తీయడం మొదలు పెట్టాలని ఆదేశించారు. ప్రతి కిలో మీటర్ కి ఒక మ్యాప్ సిద్ధం చేసి పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. చేసిన పనులకు ఇజియస్ ద్వారా చెల్లిపులు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోవచ్చే హరిత హారములో 86 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఉందన్నారు. అనంతరం మండలలవారిగా చేపట్టే పనులను ఆదనవు కలెక్టర్లతో కలసి సమీక్షించారు.
జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేయాలి
జిల్లాలో ఇప్పటివరకు 31 క్రీడా ప్రాంగణాలను గుర్తించామని జిల్లా కలెక్టర్ టి. వినరు కష్ణా రెడ్డి అన్నారు. గురువారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎస్. మోహన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్ లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో క్రీడాభివద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలోని 31 కేంద్రాలను ఇప్పటివరకు గుర్తించి వాటిలో అనువైన 29 ప్రాంతాలకు అంచనాలు తయారు చేసి 13 చోట్ల పనులు కూడా ప్రారంభించామన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి 2 చొప్పున క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే జూన్ 2 న క్రీడా ప్రాంగణాలు ప్రాంభించుకునేందుకు పనులు చేపట్టి సిద్ధం చేసి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చివ్వేంలలో 2, గారిడేపల్లి 1, జాజిరెడ్డి గూడెం 2, కోదాడ 1, మెల్లచెర్వు 2, మునగాల 1, నడిగూడెం 2, నూతన కళ్ళలో 1 మొత్తం 12 చోట్ల పనులు చేపట్టడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.ఎఫ్. ఓ ముకుంద రెడ్డి, ఆర్డీఓ లు రాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్, వెంకా రెడ్డి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఏపీడీ డా. పెంటయ్య, ఇరిగేషన్ ఎస్ఈ నాగేశ్వర రావు, నర్సింగ రావు, ఈ ఈలు భద్రు నాయక్, విజరు కుమార్, సత్యనారాయణ, శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.