Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
చేనేత కార్మికులకు వయస్సుతో నిమిత్తం లేకుండా బీమాను అమలు చేయాలని చేనేత కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కేంద్రంలోని పద్మశాలి కాలనీలో సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రండేళ్లుగా చేనేత కార్మికులు లాక్ డౌన్, కరోనాతో కార్మికులు ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. ఉపాధి కోల్పోయి పూట గడవక కార్మికులు ఆకలిచావులు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూలు, రంగుల ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. బీమా పథకాలు అమలు చేయాలని, 40శాతం సబ్సిడీని కార్మికుల ఖాతాల్లో నెలనెలా జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కూరపాటి రాములు, రేగోటి యాదగిరి, రేగోటి పరశురాములు, లక్ష్మమ్మ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.