Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిప్పర్తి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలి స్టాకింగ్ ఎగుమతి కూలి రేట్లు పెంచాలని సీఐ టీయూ తిప్పర్తి మండల కన్వీనర్ భీమ గాని గణేష్ డిమాండ్ చేశారు. తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని రామకృష్ణ స్టోరీజి గోదాంలో హమాలి కార్మికుల కూలి రేట్లు పెంచాలని సమ్మె జరుగు తుంది. ఈ సమ్మెకు ముఖ్యఅతిథిగా గణేష్ మాట్లాడుతూ హమాలి రేట్ల ఒప్పంద గడువు ముగిసి నెల దాటినా నూతన రేట్ల ఒప్పందానికి రాకుండా యజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. గోదాంలో హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, విశ్రాంతి గదులు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని, లేనియెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జిల్లాల సుధాకర్ రెడ్డి, అలిదాసు సైదులు, ఏడుకొండలు, పాపయ్య, నగేష్, సురేష్, నరేష్ లింగయ్య ,పుల్లయ్య, లక్ష్మయ్య, సైది రెడ్డి ,వెంకట్ రెడ్డి, జనార్ధన్ వెంకన్న, ఈదయ్య, ఆశీర్వాదం, మధుసూదన్ పాల్గొన్నారు.