Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
హుజూర్నగర్ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలువ కట్టలపై గత కొంతకాలంగా ఇల్లు నిర్మించుకుని ఉన్న అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని హుజూర్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గెల్లీ అర్చన రవి అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బైపాస్ నిర్మాణం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కాల్వ కట్టలపై ఉన్న ఇళ్లను అధికారులు తొలగించాల్సి వచ్చింది అన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే పట్టణం మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అన్నారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ప్రత్యామ్నాయం చూసిన తర్వాతే ఇళ్లను తొలగించాలి
పట్టణంలోని లింగగిరి కాలువ కట్టపై నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే తొలగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అన్నారు. అధికారులు ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా అధికారులు వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లను మంజూరు చేసిన తర్వాత తొలగించాలన్నారు.