Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
పేద ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వాలపై వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల అధిక ధరలను వ్యతిరేకిస్తూ ఈనెల 27 న వామపక్షాల ఆద్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కోరారు. కేంద్రంలో ఉన్న బిజేపి సర్కార్ దేశ ప్రజలపై పెను భారాలు మోపుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూందని ఆయన ఆరోపించారు. పెట్రోల్, డిజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికంటి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు ఆడంబరాలకు పోతూ, పోరాడుతున్న ప్రజల్ని దష్టి మళ్లించేందుకు మతం, ప్రాంతం, బాష పేరుతో సెంటిమెంటు రగీలించి రాజకీయా లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్ని కార్పోరేట్లు, ప్రయివేటోల్లకు దారాదత్తం అవుతున్నాయాని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా జరిగే నిరసనలు, దర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటి సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, నాయకులు గాదె నరేందర్, బల్గూరి అంజయ్య, బావండ్లపల్లి బాలరాజు, గొరిగె సోములు, పిట్టల శ్రీనివాస్, కూనూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు.