Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌రూరల్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన అవినీతి అక్రమాలమయంగా మారిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్కిఆరం అని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని లక్కవరం, శ్రీనివాసపురం, అమరవరం, అంజిలిపురం, లింగగిరి, సర్వారం, సీతారాం పురం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి మాట్లా డారు. ఉదరుపూర్, వరంగల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన ్ప్రజలోకి తీసుకెళ్లే లక్ష్యంతోనే రచ్చబండ, రైతుభరోసా యాత్ర కార్యక్రమం చేపట్టామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి సంవత్సరానికి రూ.15 వేలు, రైతుకూలీలకు రూ.12 వేలు పంటల పెట్టుబడి సహాయం అందజేయ టమే కాకుండా రూ.2 లక్షల రుణమాఫీ ఒకే దఫాలో చేస్తామన్నారు. పంటల భీమా పథకం అమలు చేసి వరి పంటకు క్విం టాలకు రూ.25 వేల మద్దతు ధర అందిస్తామన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని తన హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం నియోజకవర్గంకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిందన్నారు. మండలంలోని ప్రతి గ్రామాలను కలుపుతూ లింక ్రోడ్డులు, బ్రిడ్జి నిర్మాణాలు, ఎత్తిపోతుల పథకాలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, పేదలకు గృహ నిర్మాణాలు వంటి ఎన్నో కార్యక్ర మాలు చేపట్టానన్నారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి.నిజాముద్దిన్, ఎన్ఆర్ఐ సాముల జైపాల్‌రెడ్డి, ఈదపుగంటి సుబ్బారావు, దొంగరి వెంకటేశ్వర్లు, చక్కెర అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్, వైస్ ఎంపీపీ సైదమ్మ, ఆదినారాయణరెడ్డి, ఉస్తెల గుర్వారెడ్డి, గ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షులు చవ్వగాని సైదులు, గడ్డం రాజుయాదవ్, కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.