Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి : సీసీ కెమెరాలు ఏర్పాటు అభినందనీయమని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం కొండమల్లేపల్లి పట్టణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఏర్పాటును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారిపై రోడ్ల, వీధుల వెంట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల చోరీలను, అవాంఛనీయ సంఘటనలను వెంటనే గుర్తించవచ్చు అన్నారు. ఒక సీసీ కెమెరా 100 మందితో సమానం అన్నారు. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను శాలువా కప్పి అభినందించారు. అనంతరం డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ రవీందర్, ఎస్ఐ నారాయణరెడ్డి శాలువాతో ఎస్పీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మండల అధ్యక్షులు జెట్టమొని యాదయ్య, కిరాణా అసోసియషన్ సభ్యులు విజరు కుమార్, మెడికల్ షాప్ నిర్వాహకులు ధనుంజయ, ఓంకారం శ్రీనివాసులు, బట్టల షాప్ అసోసియేషన్ అధ్యక్షులు రవి, ఆర్ఎంపీ వైద్యులు శ్రీనివాసులు, ధనంజయ పాల్గొన్నారు.