Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షకార్యదర్శులు అయూబ్, నర్సింహ
నవతెలంగాణ -నల్లగొండ
ఎలాంటి షరతుల్లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడ ిటేషన్ కార్డులివ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎస్కే ఆయూబ్, బాదిని నర్సింహాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు వారు మాట్లాడారు. సంస్థ ఐడీ కార్డు ఉన్న జర్నలిస్టులందరికీ నిబంధనలతో సంబంధం లేకుండా అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రిపోర్టర్లకు పక్షపాతం లేకుండా కార్డులు జారీ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రయివేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీని వర్తింపజేయాలని, ఈ మేరకు కలెక్టర్ చొరవ తీసుకుని జీఓ జారీ చేయాలని పేర్కొన్నారు. జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో సంఘం గౌరవ సలహాదారు మట్టయ్య, జాతీయ కౌన్సిల్ సభ్యులు గాదె రమేశ్, జిల్లా ఉపాధ్యక్షులు వర్ణమ్మ, జాజుల లింగస్వామి, సహాయ కార్యదర్శులు సాదత్ అలీ, శ్రీపతిరావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.