Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే ప్రభుత్వం గద్దె దిగాలి
- సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాన-సూర్యాపేటటౌన్
దేశంలో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను, పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను అదుపు చేయలేని మోడీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.పెరుగుతున్న ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దేశంలో రోజురోజుకు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో విఫలమైందన్నారు.కార్పొరేట్‌శక్తులకు ఊడిగం చేసే విధంగా వ్యవహరిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం మోపడం సిగ్గుచేటన్నారు.ఇటీవలకాలంలో పెట్రోల్,డీిజిల్,గ్యాస్ ధరలు తగ్గించామని ఊదరగొడుతున్నా పాలకులు అధికారంలోకి రాకముందు ఉన్న ధరలను పెద్దఎత్తున పెంచడం దుర్మార్గమన్నారు. మోడీకి అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తుల మీద ఉన్న ప్రేమ దేశ ప్రజల పైన లేదన్నారు.బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ధరల విషయంలో తగిన రీతిలో ఉద్యమాలు నిర్వహించడం లేదన్నారు.కేంద్రం తగ్గించింది కాక కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం పెట్రోలు,డీజిల్ పైన ప్రతి లీటర్‌కు పది రూపాయల చొప్పున తగ్గించి ప్రజలను ఉపశమనం కలిగించే విధంగా చేసిందన్నారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్షాలు నిర్వహిస్తున్న పోరాటాలకు ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.ధర్నాకు ముందు పట్టణంలోని వాణిజ్య భవన్ నుండి అలంకార్ రోడ్డు,పూలసెంటర్ మీదుగా తహసీల్దార్ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సీపీఐఎంఎల్ ప్రజపంథా జిల్లా నాయకురాలు కొత్తపల్లి రేణుక,ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కునుకుంట్ల సైదులు,సీపీఐఎంఎల్ రామచంద్రన్ వర్గం రాష్ట్ర నాయకులు బుద్ధా సత్యనారాయణ, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరి నర్సయ్య,సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,ఎలుగూరి గోవిందు,కోటగోపి,సీపీఐ జిల్లా నాయకులు మూరగుండ్ల లక్ష్మయ్య, దోరేపల్లిశంకర్,సీపీఐఎంఎల్ ప్రజపంథా జిల్లా నాయకులు ఎర్ర అఖిల్,జీవన్, ఎంసీపీఐ జిల్లా నాయకులు ఎస్కె.నజీర్, ఏపూరి సోమన్న,సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వేల్పుల వెంకన్న, జె.నర్సింహారావు, మేకనబోయిన సైదమ్మ, కొప్పుల రజిత,మేకనబోయిన శేఖర్, చినపంగినర్సయ్య, వీరబోయినరవి,సీపీఐ నాయకులు బూర వెంకటేశ్వర్లు,ఖమ్మంపాటి రాము,చాంద్‌పాషా, ప్రజపంథానాయకులు చంద్రకళ, సీపీఐ(ఎం) పట్టణనాయకులు మామిడి సుందరయ్య, సత్యనారాయణరెడ్డి,వీరారెడ్డి,నాగేందర్‌రెడ్డి, కేశవరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు తగ్గించాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
చౌటుప్పల్:పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ డిమాండ్ చేశారు. ధరలను తగ్గించాలని డిమాండ్ ఏస్తూ డిమాండ్‌చేస్తూ శుక్రవారం సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్ల అవుతున్నా రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి, 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.7500 ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధిహామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీచేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భతి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలన్నారు. పెంచిన భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌చేశారు. అనంతరం ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, బూర్గు కష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాస్‌చారి, సీపీఐ మండలకార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి, నాయకులు ఆకుల ధర్మయ్య, అంతటి అశోక్, చీకూరి ఈదయ్య, రాగీరు కిష్టయ్య, పగిళ్ల మోహన్‌రెడ్డి, బోయ యాదయ్య, బాలనర్సింహా, ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం, ఆదిమూలం నందీశ్వర్, ఎస్కె.మదార్ పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న అధిక ధరలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణ కార్యదర్శి మాయ కష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏషాల అశోక్ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌పై అన్ని రకాల పన్నులను తగ్గించాలని కోరారు. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల పై ఉచితంగా అందించాలని, అసంఘటిత రంగ కార్మికులు అందరికీ నెలకు 7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం తహసీల్దార్ కొప్పుల వెంకట్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ముదిగొండ రాములు, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ గౌడ్, సీపీఐ(ఎం)పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య పట్టణ కమిటీ సభ్యులు బందెల ఎల్లయ్య, సీపీిఐ మండల కార్యవర్గ సభ్యులు గుండ్ల లక్ష్మయ్య పట్టణ సహాయ కార్యదర్శి చింతల మల్లేశం, సీపీఐ(ఎం)పట్టణ కమిటీ నాయకులు చింతల శివ, దండు గిరి, సీపీఐ పట్టణ కార్యవర్గ సభ్యులు భద్రమైనవెంకటేశం ,దిండిగల్ రుక్మిని, సీపీఐ(ఎం) పట్టణ నాయకులు కల్లూరి నాగమణి, కోటగిరి వీరబ్రహ్మం, వనంగిరి , సీపీిఐ పట్టణ కార్యవర్గ సభ్యులు దాసరి లక్ష్మయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఉప్పల శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.