Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
విత్తన డీలర్లు రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించాలని మండల వ్యవసాయ అధికారి మహ్మద్ జానిమియా అన్నారు.శుక్రవారం మండలపరిధిలోని బాలెంల గ్రామంలోని రైతు వేదిక లో వ్యవసాయ,పోలీసు శాఖ అధికారులు విత్తనడీలర్లకు సమావేశం నిర్వహించారు.వానకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని,గ్రామాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తే సమాచారం అందించాలని సూచించారు.ప్రభుత్వ అనుమతి లేని హెచ్టీకాటన్ విత్తనాలను విక్రయిస్తే డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో ఆధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేసి రశీదు పొందాలన్నారు.విత్తనప్యాకెట్పై జీఈఏసీ అప్రూవల్,ట్రూత్‌ఫుల్ లేబుల్ ఉండే విధంగా చూసుకుని, పంటకాలం పూర్తయ్యేవరకు చింపిన విత్తన ప్యాకెట్లను భద్రపరచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ ముత్తయ్య, స్వాతి, లక్ష్మీఅనూష, అయేషా, రూరల్ ఏఎస్ఐ వెంకట్రాములు, హెడ్‌కానిస్టేబుల్ బాబురావు, డీలర్లు రవి, సైదులు, లక్ష్మయ్య,రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.