Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్‌భగీరథతో ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రం
- వాషింగ్టన్లో మీట్అండ్గ్రీట్లో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను మించి పోయిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డితో వర్జీనియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ లు మీట్అండ్గ్రీట్ నిర్వహించారు.సుమారు 300 మంది ఎన్ఆర్ఐలు ఇందులో పాల్గొన్నారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న అభివద్ధిపై ఎన్ఆర్ఐలు సూటిగా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.ఎన్ఆర్ఐ డెవలప్మెంట్ ఫోరమ్‌కు చెందిన బొజ్జ అమరేందర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వరి దిగుబడిలో రాష్ట్రం పంజాబ్‌ను మించిపోయిందన్నారు.రైతు పండించిన పంటను కొనుగోలు చేయడంలో చేతులు ఎత్తేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయకోణంలో స్పందించి కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలుపరిచిన మిషన్ భగీరథ తో ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రం గా తెలంగాణా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సహా దేశ విదేశీ సంస్థలు కితాబిచ్చాయన్నారు.విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం యావత్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.అనంతరం మంత్రి శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాలదయాకర్రెడ్డి, ఎన్ఆర్ఐలు శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్, కాల్వలవిషు,పాదూరు శ్రవణ్, బొజ్జ అమరేందర్, కొండారపు సుధా, బాబురావు పాల్గొన్నారు.