Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
పురపాలక సంఘంలోని బస్టాండ్ వద్ద మహానీయులు జ్యోతిరావుఫూలే, చదువుల తల్లి సావిత్రిబాయిఫూలే, తెలంగాణ సాయుధ పోరాట యోధులు కట్కూరి సుశీలాదేవి, రామచంద్రారెడ్డి విగ్రహాల పక్కన సులబ్ కాంప్లెక్స్ నిర్మించొద్దని కోరుతూ సీపీఐ(ఎం), సీపీఐ ,సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ మండల పట్టణ ,కమిటీల ఆధ్వ ర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మహనీయుల విగ్రహాల వద్ద సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మించవద్దంటూ ముక్తకంఠంతో కోరారు .అనంతరం తహసీల్దార్ గణేశ్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్‌కి సమస్య గురించి వివరిస్తూ వెంటనే సులభ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఆపా లని కోరారు. సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు మా టూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు పట్టణ కార్యదర్శి ఎంఎ.ఇక్బాల్, మండల కార్యదర్శి ధూపాటి వెంకటేష్, పీఏసీ ఎస్ సింగిల్ విండో మాజీ జిల్లా డైరెక్టర్ మొరి గాడి చంద్ర శేఖర్, సీపీఐ మండల కార్యదర్శి చవుడబోయిన కనకయ్య, పట్టణ కార్యదర్శి గొట్టిపాముల రాజు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు చుంచు యాకూబ్, పద్మ సుదర్శన్, మున్సిపల్ పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు మొరిగాడి రమేష్ ,వడ్డెమాన్ శ్రీనివాసులు, నల్లమాస తులసయ్య పాల్గొన్నారు.