Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వామపక్ష పార్టీల పిలుపుమేరకు నల్లగొండ మండల తహసీల్దార్ కార్యాల యం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. పనుల మీద పన్నులు వేస్తూ ప్రజల నడ్డివిరిచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడు తున్నాయని ఆరోపించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అదుపు చేయడంలో విఫల మయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఎండి.సలీమ్, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ,కొండ అనురాద, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, పట్టణ కమిటీ సభ్యులు భూతం అరుణ, కొండ వెంకన్న, గాదె నర్సింహ, మధుసూదన్ రెడ్డి, సలివోజు సైదాచారి, పోలె సత్యనారాయణ, బొల్లు రవీందర్, గనిపల్లి రాములు, రాంరెడ్డి, రాములు, మల్లయ్య, సుందరయ్య, జాన్ రెడ్డి, విష్ణుమూర్తి, సాబేర బేగం, తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో...
పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి, పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి (పీఎఫ్ఆర్డీ)ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని ఎస్టీఎఫ్ఐ మహాసభ తీర్మానం మేరకు శుక్రవారం క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో వైఫల్యం చెందిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగామత వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుందన్నారు. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగుల పెన్షన్ హక్కును లాగేసుకున్న ప్రభుత్వం అంతటితో ఆగకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తుందన్నారు. ప్రదర్శనలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షురాలు అరుణ, కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి, సరళ, జిల్లా కార్యదర్శులు రాజశేఖర్, రామలింగయ్య, నరసింహ, రమాదేవి, వెంకన్న, జిల్లా నాయకులు యోగేంద్రనాథ్, వీరాచారి, మాణిక్యం, నాగిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి కార్యాలయంలోని డి ఏ ఓ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభు త్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. వంటనూనెలు, పప్పుదినుసులు ధరలు మూడింతలు పెరిగాయని, చివరికి కూర గాయల ధరలు కూడా మండుతున్నాయని వాపోయారు. ఎక్కడో జరిగిన యుద్ధాలను సాకు చూపి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచటం సరైంది కాదన్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు డబ్బీకార్ మల్లేష్, వీర పల్లి వెంకటేశ్వర్లు, వస్కుల మట్టయ్య, బంటు వెంకటేశ్వర్లు, రవి నాయక్, ఎండీ. సయ్యద్, సైదమ్మ, ఊర్మిల, తిరుపతి రామ్మూరి పరశురాములు, గోవింద్ రెడ్డి, దేశిరం నాయక్, లక్మి నారాయణ, రామారావు, యేసు, కోడి రెక్క మల్లయ్య, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.