Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు టీిఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్రే వెంకటయ్య మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ తెలిపారు. శుక్రవారం స్థానిక గోంగిడి నిలయంలో నిర్వహించిన టీిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో నూ అట్టహాసంగా పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించాలన్నారు. ఇప్పటికే గ్రామ శాఖల సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు సూచనలు కూడా చేశామన్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం అన్నిరంగాల్లోనూ ముందుకు వెళ్తుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ ఎరుకల సుధా హెమేందర్ గౌడ్ , టీఆర్ఎస్ నాయకులు మిట్ట వెంకటయ్య , బైరాగాని పుల్లయ్య ,పెరిమల్లి శ్రీధర్ ,బాలయ్య, భీమగాని నరసింహ, ఎండి.అజ్జు తదితరులు పాల్గొన్నారు.