Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
డా.బి.ఆర్.అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడిన అగ్రకుల ఆధిపత్య శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు.దీనిపట్ల శుక్రవారం జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ఏపీలోని జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమర యోధులు ప్రముఖుల పేర్లు పెట్టారన్నారు.కానీ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ నామకరణం చేయడంతో కొన్ని మతోన్మాద, కులోన్మాద శక్తులు జీర్ణించుకోలేక నానారాద్ధాంతం చేస్తూ హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు.ఈ శక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని స్వార్థపర శక్తులు , మనువాద మతోన్మాద ఉన్మాదశక్తులు ప్రజల్లో విధ్వేషాలు రగిల్చి వివాదం చేయడాన్ని ఖండించాలన్నారు.ఈ కార్యక్రమంలో పట్నం జిల్లా కన్వీనర్ జె.నర్సింహారావు, ఆవాజ్ జిల్లా కార్యదర్శి జహంగీర్,సీఐటీయూ జిల్లా నాయకులు మామిడి సుందరయ్య,కెేవీపీఎస్ జిల్లా నాయకులు ధనమూర్తి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.