Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగస్తుల ధర్నా
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లా సహకార కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై అసభ్య పదజాలంతో వేధిస్తూ ఇతర ఉద్యోగస్తులను బెదిరింపులకు గురిచేస్తున్న శాఖ అధికారి ఎస్వీ ప్రసాద్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని శుక్రవారం ఉద్యోగస్తులు ఆ కార్యా లయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్ర మానికి జిల్లా టీఎన్జీఓస్ యూనియన్, టీజీఓ డ్రైవర్స్ యూని యన్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘాలు ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సహకార శాఖ ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మెన్ మంత్రవాది శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సహకార శాఖలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పరపతి సంఘం ఎంక్వయిరి రిపోర్టును ఆధారంగా చేసుకొని డీసీఓ సామాన్య ఉద్యోగులపై దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆడిట్ రిపోర్టులో లేని తప్పులను ఉద్యోగులపై రుద్దుతూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. సీఎం కార్యాలయం నుండి ఎంక్వయిరికి ఆదేశించిన ఉత్తర్వులపై మూడు నెలల కాలంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉ ద్యోగులను డిప్యూటేషన్ చేయడం, డబ్బులు వసూలు చేయడం, తీవ్రపదజాలంతో తిట్టడం, ఉద్యోగు లను భయభ్రాంతులకు గురిచేయడంను తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీజీఓ అధ్యక్షులు ఎండీ.ముజీబొద్దీన్, కార్యదర్శి శ్రీ కిరణ్ కుమార్, టీఎన్జీఓ సెంటల్ ఫోరమ్ కార్యదర్శి ఎం.మాధవి, టీఎన్జీఓ సెంటల్ ఫోరమ్ కార్యవర్గ సభ్యులు మురళి, కోశాధికారి జయరావు , ఉపాధ్యక్షులు టి.రమాదేవి , శేఖర్ రెడ్డి, ఎం . శ్రీనివాస రావు, సంయుక్త కార్యదర్శి కె.ధశరథ, నల్లగొండ యూనిట్ అధ్యక్షులు ఎ.లక్ష్మయ్య , డ్రైవర్స్ అసోసి యేషన్ అధ్యక్షులు పి.శ్రీనివాస్, నాల్గవతరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బిక్షమయ్య, పశు సంవర్ధక శాఖ ఫోరం అధ్యక్షులు సైదులు, వంగూరు విజయక్రిష్ణ పాల్గొన్నారు.