Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపురం రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో రోడ్ మార్కింగ్ చేస్తున్నారని ప్రజల్లో భయాందోళనలు మొదలై ఇంటి నుండి బయటకు వచ్చి రాంపురం రోడ్డు రోడ్ మార్కింగ్ చేసిన వారిని బాధితులు మరియు అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.రోడ్డుకిరువైపులా 30 అడుగుల మేరకు మార్కింగ్ చేస్తున్నారని కమిషనర్‌ను ప్రశ్నించారు.కొంతమంది మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ గోడును వెలిబుచ్చారు.అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారని, కమిషనర్‌ను ప్రశ్నించారు. ఇది సరైన నిర్ణయం కాదని రూ.15 కోట్ల అభివద్ధి ఏమోగానీ రూ.100 కోట్ల ఆస్తినష్టం వాటిల్లుతుందని బాధితులు వాపోయారు.ఈ కార్యక్రమంలో బాధితులు బసవలింగం, సుజన్‌కుమార్ వెంకటేశ్వరరావు, రామ్మూర్తి, అశోక్ అఖిలపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారే పల్లి శేఖర్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొణతం చిన్న వెంకటరెడ్డి టౌన్ అధ్యక్షులు నూకల సందీప్ రెడ్డి సిపిఎం మండల కార్యదర్శి సిరికొండ శీను, కాంగ్రెస్ నాయకులు జంగిలి. వెంకటేశ్వర్లు, బాధితులు బాధిత మహిళలు పాల్గొన్నారు.
కేవలం అవగాహన కోసం మార్కింగ్ చేశాం
మున్సిపల్ కమిషనర్-వెంకటేశ్వర్లు
కేవలం అవగాహన కోసం మాత్రమే మార్కింగ్ చేశాం.ఎన్ని ఫీట్ల వరకు మార్కింగ్ చేస్తే ఎంత డ్యామేజ్ జరుగుతుందని అంచనా కోసం మాత్రమే మార్కింగ్ చేశాం.