Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
రాష్ట్రాభివృద్ధిపై టీఆర్ఎస్కు చిత్తశుద్ధిలేదని , ఏ ఒక్క వాగ్దానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.శుక్రవారం పట్టణంలోని 20 వార్డులలో నిర్వహించిన రచ్చబండ రైతు భరోసాయాత్రలో పాల్గొని ఆయన మాట్లాడారు.ఈ యాత్ర ముఖ్యఉద్దేశం ప్రజలకు మరింత చేరువ కావడం కోసమేనని, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాసమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తనవంతు చిత్తశుద్ధితో నిజాయితీతో కషి చేస్తానన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఏ ఒక్క గ్రామంలో కూడా పూర్తిగా పంపిణీ చేయలేదన్నారు.అదేవిధంగా నూతన రేషన్‌కార్డు గానీ, నూతన పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టలేదన్నారు.2023 మే వరకు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తాను నియోజకవర్గంలో 50 వేల పైచిలుకు ఓట్లతో గెలుస్తానన్నారు.ఈ నియోజక వర్గంలో గతంలో వామపక్ష పార్టీల నాయకులు జూలకంటి రంగారెడ్డి ,అరిబండి లక్ష్మీనారాయణ, అదే విధంగా కాంగ్రెస్ నాయకులు రేపాల శ్రీనివాస్, విజయసింహారెడ్డి అంటే నాయకులు ఈ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ అవినీతికి దూరంగా ఉన్నారన్నారు. నేడు ఉన్న ఎమ్మెల్యే అందుకు భిన్నంగా అవినీతిలో మునిగిపోతున్నారన్నారు. ఇక్కడ ఉన్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలు స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయడానికి కాకుండా కేవలం ఎమ్మెల్యే సొంత మనుషులుగా పని చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు కూడా అదే పాత్ర నిర్వహిస్తున్నారని, ఈ విధానాన్ని మార్చుకుంటే మంచిదన్నారు.గతంలో ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్టర్ సస్పెండై పోయిన సంగతి అధికారులు మరువ కూడదన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణంలోని వాడల నాయకులతో పాటు ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగన్నగౌడ్, పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్,సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,అరుణ్‌కుమార్, దేశ్‌ముఖ్, సత్య నారాయణ,కోల మట్టయ్య, కస్తాలశ్రావణ్ పాల్గొన్నారు.