Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నిషేధమని, సిగరెట్, పొగాకు ఉత్పత్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి కోరారు.శుక్రవారం పట్టణంలో వివిధ ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీ బందాలు ఆధ్వర్యంలో విస్తత తనిఖీలు చేపట్టాయి. సిగరేటు , పొగాకు ఉత్పత్తులను నిషేధ చట్టం- 2003 సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నిషేధమని, అతిక్రమి ంచినచో రూ.200 జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. సిగరెట్, గుట్కా, ఖైనీ,తంబాకు లాంటివి నోటి ుభ్రతను నాశనం చేస్తాయని నోటి, గొంతు , ఊపిరితిత్తుల క్యాన్సర్లకు కారకాలుగా పరిణమిస్తాయమన్నారు.పొగాకుకు బానిసలైన వారికి ప్రత్యేక డి అడిక్షన్ సెంటర్లు హుజూర్నగర్, సూర్యాపేటలోని ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్య కార్యకర్తల వద్ద నోటి క్యాన్సర్లకు సంబంధించిన ఉచితపరీక్షలు చేసుకోవాలని కోరారు.అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం కోఆర్డినేటర్ భూతరాజు సైదులు, ప్రత్యేకాధికారులు సురేంద్ర, మండవ హుస్సేన్‌గౌడ్, పోతులూరి చారి పాల్గొన్నారు.