Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుంగతుర్తి :ఫైలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా, నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని జిల్లా అధికారి డాక్టర్ సాహితీ అన్నారు.శుక్రవారం సామాజిక ఆరోగ్యకేంద్రం తుంగతుర్తి పరిధిలోని పసునూరు గ్రామంలో సర్పంచ్ వేల్పుల సాలయ్య అధ్యక్షతన ఫైలేరియా వ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఫైలేరియా వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైలేరియా మార్బిడిటిమేనేజ్మెంట్ కార్యక్రమంలో, వ్యాధిగ్రస్తులకు టబ్, మగ్,ఆయింట్మెంట్, టవల్, సబ్బు ఉచితంగా అందజేసి వాపు తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవ గాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఈఓలు సముద్రాల సూరి, బొమ్మ గానినర్సయ్య, ఎంపీటీసీ మంజుల, హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమయ్య,యాదగిరి, నర్సింహాచారి, మేడే లక్ష్మీబాయి, ఫైలేరియా వర్కర్ వెంకన్న, ఆశాకార్యకర్తలు సుశీల, సుజాత, అనిత, రాధా తదితరులు పాల్గొన్నారు.