Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) దేవరకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దేవరకొండ బస్ స్టాండ్ సెంటర్లో దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య, బి.లింగయ్య, నల్ల రామస్వామి, నల్ల చిన్న వెంకటయ్య, నల్ల శ్రీను, నల్ల వీరయ్య, లలిత, పూర్ణమ్మ, బిజిలీ రవి, హనుమంతు, శ్రీను, అంకూరి నరసింహ, లక్ష్మమ్మ, రాములు, విజయ తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి : నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తహసీల్దార్ అర్చనకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి శ్రీకర్, రైతు సంఘం జిల్లా నాయకులు దేవిరెడ్డి అశోక్ రెడ్డి, వెంకటాచారి, నాగయ్య, నాగమ్మ, మల్లారెడ్డి నారాయణరెడ్డి, పండగ నాగయ్య, వెంకన్న, వెంకటయ్య, నాగిరెడ్డి, కొంచెం వెంకన్న, నవీన్, ఏసోబు పాల్గొన్నారు.
తిప్పర్తి : నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి, మండల కార్యదర్శి మన్నెం భిక్షం ఆరోపించారు. శుక్రవారం వామపక్ష పార్టీల పిలుపుమేరకు తిప్పర్తి మండల తహసీిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయ కులు గంటెకంపు రమణయ్య, బోల్లెద్దు నాగయ్య, కస్పరాజు వెంకన్న, శంకర్, నరేష్, అనిత, రమణ, కవిత, ఎసు మల్లయ్య పాల్గొన్నారు.