Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
స్వాతంత్ర పోరాటయోధులు, భారత తొలిప్రధాని భారతరత్న, పండిత జవహర్ లాల్ నెహ్రూజీ 58 వ వర్థంతిని శుక్రవారం మండల కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ కమీటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూజీ విగ్రహానికి పూలమాలలు సత్కరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జమీరుద్దీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానీభారు, రాపోలు రాజశేఖర్, జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి ఏజాస్, మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి.జానీ, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి.మహబూబ్ అలీ, కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం అశోక్, గుండాల రమేష్, ఎండి రిజ్వాన్, నామానంది అశోక్, మేడి ఎల్లయ్య, ఎండి.లతీఫ్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.