Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
ప్రయివేటు పాఠశాల బస్సులపై విధించిన అదనపు జరిమానాలను ప్రభుత్వం రద్దు చేసి ఆదుకోవాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు కోరారు. చండూరు గాంధీజీ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన ట్రస్మా జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ప్రయివేటు పాఠశాలలు బతుకులు చిద్రమయ్యాయని, సుమారు 30 శాతం బడ్జెట్ పాఠశాలలు మూతపడ్డాయని, ఉన్న పాఠశాలలు ఎలా నడపాలన్న ఆర్థిక సందిగ్ధంలో కొట్టుమి ట్టాడుతున్నారని అన్నారు. ఈ తరుణంలో స్కూల్ బస్సులపై గ్రీన్ టాక్స్లు, ఏప్రిల్ నెల నుండి ఫిట్నెస్ లేటుగా చేయించుకున్న బస్సులకు రోజుకు 50 రూపాయలు అదనపు ఛార్జ్ అని, రెండు సంవ త్సరాలుగా ఫిట్ నెస్ లేని బస్సులకు రూ.50 వేల వరకు చెల్లించమనడం సరికాదన్నారు. కార్యక్ర మంలో ట్రస్మా జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. రావు, జిల్లా కోశాధికారి మట్ట చెన్నయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ మక్కముల నరసింహ, నల్లగొండ టౌన్ అధ్యక్షులు ఎండీ.అజీజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి, ప్రచార కార్యదర్శి గిరిధర్ గౌడ్ పాల్గొన్నారు.