Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-కేతేపల్లి
కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామంలో మల్లన్న గుట్ట పై శివాలయ పున నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం శివాలయం నిర్మాణ పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాల వెంకట్ రెడ్డి, శివాలయం చైర్మెన్ కానుగు యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
క్షతగాత్రులకు సేవలందించిన ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రథóమ చికిత్స సేవలందించి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మానవత్వం చాటుకున్నారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల పరిధిలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రథóమ చికిత్స చేయించి నార్కట్పల్లి కామినేని హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు.