Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ బొత్తలపాలెం, దేవ్లాతండా, పాలకవీడు, జాన్‌పహాడ్, నాగిరెడ్డిగూడెం గ్రామపంచాయతీల్లో క్రీడా మైదానాల నిర్మాణపనులను ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లా డుతూ ప్రభుత్వ నిర్ణయం,కలెక్టర్ ఆదేశాలనుసారం అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తామని తెలిపారు.బొత్తలపాలెం రెవెన్యూశివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 98లో సంపూర్ణంగా క్రీడామైదానానికి కావాల్సిన ఎకరం భూమిని సర్వేయర్ ద్వారా కొలిచి సర్పంచ్ వీరారెడ్డి, పాలకవర్గం సమక్షంలో పనులను ప్రారంభించామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్, ఉపసర్పంచఫ్ వెంకటయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అనంతప్రకాష్, ఏపీఓసందీప్రెడ్డి,భూపాల్, పెద్దవెంకారెడ్డి, రామినేనివెంకటయ్య, వీరభద్రం, అత్తిరాంబాబు, అంది కనకయ్య, వడ్డె సైదయ్య పాల్గొన్నారు.