Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
కోనసీమ విధ్వంసం వ్యతిరేకిస్తూ ఆత్మకూరు (ఎస్) మండలపరిధిలోని నెమ్మికల్ గ్రామంలోని శుక్రవారం ఎమ్మార్పీఎస్, ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ విగ్రహం ఎదుట నిరసన, రాస్తారోకో చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాట్లాడుతూ కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న అరాచకశక్తులను కఠినంగా శిక్షిం చాలని ఏపీలో నూతన జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి, వైఎస్ఆర్, పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పేర్లు పెట్టినప్పుడు లేని ఇబ్బంది.. చేయని విధ్వంసం.. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు మాత్రమే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.అంబేద్కర్ కోనసీమ కుట్ర వెనక ఉన్న అగ్ర వర్గాల ద్రోహులను కనిపెట్టి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నవిలే లింగరాజు, రేణుక, అనిత, కలమ్మ, నిర్మల, రజిత, ఉపేంద్ర, సునీత పాల్గొన్నారు.